“మిస్టర్ అండ్ మిస్” ఒక బ్యూటిఫుల్ మూవీ – జ్ఞానేశ్వరి కండ్రేగుల

Published on Jan 28, 2021 8:16 pm IST

జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా అశోక్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న క్రౌడ్ ఫండెడ్ చిత్రం మిస్టర్ & మిస్. అయితే ఈ సినిమా ఈ నెల 29న విడుదల కాబోతున్న సందర్భంగా ఈ సినిమా హీరోయిన్ జ్ఞానేశ్వరి కండ్రేగుల మీడియాతో మాట్లాడారు.

ఈ చిత్ర హీరోయిన్ జ్ఞానేశ్వరి కండ్రేగుల మాట్లాడుతూ నేను వైజాగ్ అమ్మాయినని, ఉన్నత చదువులు చదివిన ఫ్యామిలీ నుండి నేను వచ్చానని, నాకు కూడా ఉన్నత చదువులు చదవాలన్న డ్రీమ్ ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే తనకు ఫ్యాషన్స్, మోడలింగ్ అంటే ఇష్టం ఉండేదని, ఈ క్రమంలోనే ఎంబీఏ ప్రిపేర్ అవుతూ లాక్మే ఫ్యాషన్ వీక్, మ్యాక్స్ ఫెస్టివల్స్ లలో వాక్ చేశానని చెప్పుకొచ్చారు. అయితే నేను ఎంబీఏ చదువుతున్న టైంలో నా క్లోజ్ ఫ్రెండ్ ఒక షార్ట్ ఫిలింలో చేయమని రిక్వెస్ట్ చేయగా నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో అందుకు నేను నో చెప్పానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఒక్క రోజు మాత్రమే షూటింగ్ అని రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నానని ఆ షార్ట్ ఫిలిం పేరు “తను” అని చెప్పుకొచ్చింది. అయితే ఆ షార్ట్ ఫిలింకు సుమారు 4 మిలియన్ వ్యూస్ రావడంతో పాటు మంచి పేరు వచ్చిందని తెలిపింది. దీంతో అప్పటి నుంచి నాకు చాలా ఆఫర్స్ వచ్చాయని అయినా నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో నేను ఏవీ చేయలేదని చెప్పింది.

అయితే “తను” షార్ట్ ఫిలిం తర్వాత నా ఫేస్ బుక్ లో ఒకతను విజయ్ దేవరకొండ సినిమాలో మిమ్మల్ని అనుకుంటున్నామని మెసేజ్ చేశారని అది నేను అసలు నమ్మేలేదని, అయితే నాకు ప్రియదర్శన్ ఫ్రెండ్ అవడంతో ఆయనకు ఫోన్ చేసి అడిగితే అందులో ఆఫర్ వస్తే నువ్వు నో చెప్పకుండా ఒకే చెప్పమని సలహా ఇచ్చాడని చెప్పింది. ఆ సమయంలోనే నేను డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ గారికి కాల్ చేసి వారి ఆఫీసుకు వెళ్లి ఆడిషన్స్ మరియు డిస్కషన్స్ చేశానని విజయ్ దేవరకొండ గారు అర్జున్ రెడ్డి ప్రమోషన్లలో బిజీగా ఉండటం వలన డియర్ కామ్రేడ్ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది. అయితే ఆ గ్యాప్‌లో అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి బిగ్ హిట్ అవ్వడంతో అంతకుముందు డియర్ కామ్రేడ్ లో కొత్త ఆర్టిస్టులతో చేద్దామనుకున్న వారు కాస్త సీనియర్ యాక్టర్స్ ను తీసుకుని చేశారని చెప్పుకొచ్చింది. అయితే మొదటిసారి వారు నన్ను అడిగిన వెంటనే డిలే చేయకుండా ఉంటే నా మొదటి సినిమా డియర్ కామ్రేడ్ అయ్యుండేదని తెలిపింది.

అయినా “మిస్టర్ అండ్ మిస్” కూడా ఒక బ్యూటిఫుల్ ఫిలిం. నేను “లవ్ జంట” షార్ట్ ఫిలిం చేస్తున్న క్రమంలో అశోక్ గారు కలసి నాకు “మిస్టర్ అండ్ మిస్” డెమో ఫిలిం గురించి చెప్పారని, దీనికి 3 ఫిలిం ఫెస్టివల్స్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా నాకు రావడం జరిగింది అలాగే సైమా అవార్డ్స్ లో మా డెమో ఫిల్మ్ కు బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్స్ అవార్డ్స్ వచ్చాయని తెలిపింది. అశోక్ గారు దీన్ని ఫీచర్ ఫిల్మ్ గా చేద్దామని చెబితే చేద్దామని స్టోరీ చెబితే ఇందులో రొమాన్స్ ఎక్కువ ఉందని నేను నో చెప్పానని అప్పుడు ముంబై నుంచి వేరే అమ్మాయితో షూట్ స్టార్ట్ చేశారు. అయితే అప్పుడే నేను బాగా ఆలోచించి ఈ అవకాశం మిస్ చేసుకోకూడదని మళ్ళీ అశోక్ గారికి కాల్ చేసి ఒకే చెప్పానని, అప్పుడు ముంబై నుంచి వచ్చిన అమ్మాయిని క్యాన్సల్ చేసి నన్ను హీరోయిన్‌గా తీసుకున్నారని చెప్పింది. అయితే ఈ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఉందనుకొన్న టైంలో క్రౌడ్ సపోర్టుతో 80 నుంచి 100 మంది వరకు మాకు సపోర్ట్ చెయ్యడానికి ముందుకు రావడంతో దీన్ని క్రౌడ్ ఫండెడ్ మూవీగా చేయడం జరిగిందని, సపోర్ట్ చేసిన వారందరికి ధన్యవాదాలు తెలియచేసింది. చాలామంది క్రౌడ్ ఫండెడ్ మూవీ అంటే ఆర్ట్ ఫిలిం అనుకుంటారని, కానీ ఇది అందరికీ నచ్చే బ్యూటిఫుల్ కమర్షియల్ లవ్ స్టోరీ అని ఇందులో నేను శశి అనే క్యారెక్టర్ చేశాను. ముంబై కంపెనీలో హెచ్ఆర్ గా చేసే నేను హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ రావడం, ఇక్కడ అమలాపురం నుండి ఇంగ్లీష్ రానీ అబ్బాయిని కలవడం, క్లాస్ కల్చర్ నుండి వచ్చిన నేను, విలేజ్ కల్చర్ నుండి వచ్చిన అబ్బాయికి ఇంగ్లీష్ నేర్పడం, ఆ అబ్బాయితో నా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, మా ఇద్దరి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఇద్దరికీ సెట్ అవ్వక బ్రేకప్ అయ్యే టైంలో వారి ఫోన్ మిస్ అవ్వడం, ఆ ఫోన్లో వారి ప్రైవసీ కి సంబంధించిన వీడియోస్ ఉండడం, పోయిన ఫోన్ దొరికిందా లేదా, ఫోన్ ఎలా పోయింది, ఒకవేళ హీరోనే ఫోన్ తీశాడా, ఎవరైనా బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారా అనేది ఈ సినిమా కథ మేము చేసిన డెమో లో ఓన్లీ టూ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయని తెలిపింది. అయితే ఇందులో రెండు క్యారెక్టర్స్ ఎలా కలిశారు వారి ప్రయాణం ఎలా సాగింది అనేది తెలియజేస్తూ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైన్ మెంట్ ని టచ్ చేస్తూ ఈ మూవీ అద్భుతంగా చేయడం జరిగిందని, ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్ నాగ్, టెక్నీషియన్స్ టీమ్ అందరూ కూడా ఈ సినిమాకు మంచి బెస్ట్ ఇచ్చారని తెలిపింది. ఈ మూవీకి నా కో ఆర్టిస్ట్ గా పనిచేసిన సన్నీ దగ్గర నేను యాక్టింగ్ మేలుకవలు నేర్చుకున్నానని తెలిపింది. అశోక్ గారు “ఓ స్త్రీ రేపు రా” మూవీ ని ఎంత మొండిగా తీసి రిలీజ్ చేశారో, అంతే మొండిగా ఈ మూవీని కూడా తీసి రిలీజ్ చేస్తున్నారని, అశోక్ గారు వర్క్ చూసి తను ఎంతో నేర్చుకున్నానని, మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా బ్యాక్ డ్రాప్ లేదని అలాంటిది నేను హీరోయిన్ అవుతానని నేనెప్పుడూ అనుకోలేదని ఈ విషయంలో నా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ చేశారని చెప్పింది. ఈ మూవీ తర్వాత నాకు కన్నడలో తెలుగులో, ఓ.టి.టి లో ఆఫర్స్ వచ్చాయని అవి కూడా త్వరలో తెలుపుతానని చెప్పుకొచ్చింది. అయితే ఈ నెల 29న అనగా రేపు విడుదలవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, అందరికి ఇది కనెక్ట్ అవుతుందని ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఆదరించి, ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని జ్ఞానేశ్వరి చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :