‘మేమ్ ఫేమస్’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ ప్రస్తుతం మరో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘గోదారి గట్టుపైన’ (Godari Gattupaina)అనే సినిమాలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా సుభాష్ చంద్ర అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ టీజర్ ఆద్యంతం గోదావరి పరిసర ప్రాంతంలో సాగుతున్నట్లు చూపెట్టారు. పల్లెటూరు వైబ్స్‌తో సాగే ఈ టీజర్‌లో ఆస్కార్ గ్యాంగ్ అనే స్నేహితుల బ్యాచ్ చుట్టూ ఈ కథ సాగుతుంది. రాజు అనే యువకుడి పాత్రలో సుమంత్ ప్రభాస్ మరోసారి యూత్‌ను మెప్పించే పాత్రలో నటిస్తున్నాడు. ఇక మాయ అనే పాత్రలో నిధి ప్రదీప్ చాలా గ్లామర్‌గా కనిపిస్తోంది. కలర్‌ఫుల్ విజువల్స్, ఉల్లాసభరితమైన మూమెంట్స్‌తో ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. కామెడీ, ప్రేమ, భావోద్వేగాలను సమపాలల్లో ఈ టీజర్‌లో చూపెట్టారు.
ఇక ఈ సినిమాలో జగపతి బాబు, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నాగవంశీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అభినవ్ రావు ప్రొడ్యూస్ చేస్తున్నారు.


