
మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో, నాగబాబు తనయుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన ‘ముకుంద’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు వరుణ్ తేజ్. ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద విజయం కాలేదు అలాగే వరుణ్ తేజ్ కి కూడా మంచి పేరుని తెచ్చి పెట్టలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్ చాలా యావరేజ్ గా ఉందని, నటనలో తను ఇంకా చాల మెచ్యూర్ అవ్వాలని విమర్శలు వచ్చాయి.
నిన్ననే వరుణ్ తేజ్ నటించిన రెండవ సినిమా ‘కంచె’ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. అలాగే అందరూ వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్ పై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. విమర్శకులు సైతం వరుణ్ తేజ్ యాక్టింగ్ లో చూపించిన మెచ్యూరిటీని మెచ్చుకుంటున్నారు. అలాగే క్రిష్ అతని నుంచి నటనను రాబట్టుకున్న తీరు చాలా బాగుందని అందరూ ప్రశంసిస్తున్నారు. బాక్స్ ఆఫీసు వద్ద కూడా ఈ సినిమా డీసెంట్ గానే కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. వారు తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరల్డ్ వార్ II ఎపిసోడ్ చాలా పెద్ద హిట్ అయ్యింది.

