రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న కీర్తి సురేశ్‌ ‘గుడ్‌ లక్‌ సఖి’..!

Published on Nov 1, 2021 8:46 pm IST


‘మహానటి’ చిత్రంతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేశ్ లేడీ ఓరియంటెడ్ సినిమాలను కంటిన్యూ చేస్తూనే ఉంది. ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’ తర్వాత తాజాగా కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ రైఫిల్‌ షూటర్‌గా కనిపించనుంది.

అయితే నాగేశ్‌ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సుధీర్‌ చంద్ర నిర్మించగా ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన లభించింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని లాక్ చేసుకుంది. ఈ సినిమాని నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు.

సంబంధిత సమాచారం :

More