మెగా హీరో సినిమాకు భారీ డీల్ !

Published on Dec 4, 2020 2:00 am IST

మెగా హీరో సాయి తేజ్ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ సినిమాలతో హిట్ ట్రాక్లో ఉన్న ఆయన కొత్త చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటరు’ విడుదలకు రెడీగా ఉంది. డిసెంబర్లో విడుదలకానుంది. ఈలోపు సాయితేజ్ దేవ కట్ట దర్శకత్వంలో కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్. మొదటి నుండి ఈ ప్రాజెక్ట్ మీద పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. అందుకే సినిమా నిర్మాణ దశలో ఉండగానే భారీ డీల్ వచ్చిందట.

జీటీవీ ఈ సినిమా కోసం 35 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. సినిమా మొదటి షెడ్యూల్లో ఉండగానే ఈ స్థాయి ఆఫర్ రావడం నిజంగా మంచి విషయమే. ‘సోలో బ్రతుకే సో బెటరు’ చిత్రాన్ని కూడ జీటీవీ కొనుగోలుచేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని దేవ కట్ట యాధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు ‘రిపబ్లిక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. జె.భగవాన్, పుల్లారావ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ సైతం ఒక కీ రోల్ చేస్తున్నారు. ఇందులో సాయి తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

More