‘బిచ్చగాడు’నిర్మాతల తదుపరి చిత్ర ప్రీ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ !

Published on Jul 20, 2018 1:00 pm IST

‘బిచ్చగాడు’ చిత్రం తో ఘనవిజయాన్ని సాధించి’ డి 16, టిక్ టిక్ టిక్’ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అక్కట్టుకున్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో మరో చిత్రం రానుంది.

తమిళ అనువాద చిత్రాలను అందించిన ఈ సంస్థ ఈ సారి స్ట్రయిట్ తెలుగు సినిమాని నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రం యొక్క టైటిల్ ప్రీలుక్ ను ఇటీవల విడుదల చేశారు. ఈ ప్రీ లుక్ చిత్రం ఫై మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ‘వీకెండ్ లవ్’ అనే చిత్రం తో దర్శకుడిగా పరిచయమైన జర్నలిస్ట్ కమ్ డైరెక్టర్ నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వసంత్ సమీర్, సెహర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఆగష్టు మొదటి వారంలో చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను విడుదల చేయనున్నారు. చదలవాడ పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశం తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవివర్మ, శ్రీహర్ష, జబర్దస్త్ రాంప్రసాద్, రఘుబాబు, కాదంబరి కిరణ్, , కాశీవిశ్వనాధ్, తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More