‘గోపాల గోపాల’ షూట్ లో బిజీగా ఉన్న వెంకీ – శ్రియ

‘గోపాల గోపాల’ షూట్ లో బిజీగా ఉన్న వెంకీ – శ్రియ

Published on Nov 13, 2014 8:24 AM IST

gopala-gopala
స్టార్ హీరోస్ అయిన విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఓ షాప్ ఓనర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో జరుగుతోంది. వెంకటేష్, శ్రియ శరన్ లపై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ వారాంతంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.

ఇదిలా ఉండే ఈ చిత్ర డైరెక్టర్ కిషోర్ పార్ధసాని ఈ మూవీ గురించి మాట్లాడుతూ ‘ నిజం వేరు, నమ్మకం వేరు, ఈ రెండింటి మధ్య ఓ గీత ఉంటుంది. దానిని భక్తి అనేది చెరిపేస్తుంది. కానీ ఒకతను మాత్రం మనం నమ్మేవన్నీ నిజాలు కాదు, దేవుడి పైన మనకు నమ్మకం లేదు భయం మాత్రమే ఉందని అంటున్నాడు. అతని వాదన ఏంటో తెలియాలంటే మా గోపాల గోపాల చూడాలని’ అంటున్నాడు.

కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు