మజిలీ నుండి సంగీత దర్శకుడు తప్పుకున్నాడట ?

Published on Mar 20, 2019 2:52 pm IST

నాగ చైతన్య , సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం మజిలీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ , సాంగ్స్ సినిమా కు మంచి హైప్ తీసుకోచ్చాయి. అయితే తాజాగా ఈచిత్రం నుండి సంగీత దర్శకుడు గోపి సుందర్ తప్పుకున్నట్లు టాక్ వస్తుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక గోపిసుందర్ తప్పుకోవడంతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ ను తీసుకున్నారట. మరి గోపి సుందర్ తప్పుకోవడానికి కారణాలు తెలియాల్సి వుంది. అయితే ఈ వార్తలపై అధికారికంగా సమాచారం లేదు. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More