కామెడీ కోసం నానారకాల వేరియేషన్స్ !

కామెడీ కోసం నానారకాల వేరియేషన్స్ !

Published on Apr 26, 2019 3:35 PM IST

సంపత్ నంది ఇప్పటికే యాక్షన్ హీరో గోపీచంద్ కోసం ఓ మంచి కామెడీ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కెనున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని సినిమాలుగా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తోన్న గోపీచంద్ సంపంత్ సినిమాలో మాత్రం పక్కా కామెడీ అంశాలు హైలెట్ అయ్యే విధంగానే సినిమాని ప్లాన్ చేయమని సంపంత్ కి చెబుతున్నాడట.

అందుకు తగ్గట్లుగానే సపంత్ గోపీచంద్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని… సినిమా మొత్తం మీద గోపిచంద్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఆ పాత్రలోని వేరియేషన్స్ కారణంగానే సినిమాలో కామెడీ సీక్వెన్స్ హైలెట్ గా నిలుస్తాయట. అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు