మాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రదీప్ రావత్ ని చితకబాదే పనిలో ఉన్నాడు. ఇదంతా గోపీచంద్ శ్రీ వాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మాల్ టౌన్ స్క్వేర్, హేలీపాడ్, కాఫీడే ప్రాంతాల్లో జరుగుతోంది. కనల్ కన్నన్ ఈ ఫైట్ సీక్వెన్స్ ని కంపోజ్ చేస్తున్నాడు.
గోపీచంద్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వై. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. మొదటి సారి గోపీచంద్ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ‘లక్ష్యం’ తర్వాత గోపీచంద్ – శ్రీ వాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగురోంది.
గోపీచంద్ ఇది కాకుండా బి. గోపాల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా చివరి దశలో ఉంది. అది కాకుండా రాధాకృష్ణ చెప్పిన కథకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళ్తుంది


