హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్న గోపీచంద్.!

Published on Jul 14, 2021 11:00 am IST

మన టాలీవుడ్ మ్యాచో మెన్ యాక్షన్ హీరో గోపీచంద్ ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్స్ తో రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఆల్రెడీ “సీటీమార్” విడుదలకు రెడీగా ఉండగా “పక్కా కమెర్షియల్” చిత్రం షూటింగ్ స్టేజ్ లో ఉంది. అయితే వీటి అనంతరం గోపీచంద్ నుంచి తన 30వ ప్రాజెక్ట్ గా బెంచ్ మార్క్ చిత్రం నేడు అనౌన్స్ అయ్యింది.

తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అయినటువంటి “లక్ష్యం”, “లౌక్యం” వంటి చిత్రాలు అందించిన దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో హ్యాట్రిక్ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అలాగే ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు నిర్మాణం వహిస్తున్నట్టుగా ప్రకటించారు.

అలాగే ఈ చిత్రాన్ని కూడా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలిపి షూటింగ్ తొందరలోనే స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు.ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తే సినిమా నేపథ్యంని చిత్రీకరించినట్టు కనిపిస్తుంది. మరి ఈ సారి ఈ హ్యాట్రిక్ కాంబో నుంచి ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :