‘గోపీచంద్ మలినేని’ తండ్రి మృతి !

Published on Jul 28, 2019 6:21 pm IST

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తండ్రి వెంకటేశ్వర్లు చౌదరి ఈ రోజు మరణించారు. వెంకటేశ్వర్లు చౌదరి గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఈ ఇవాళ తుదిశ్వాస విడిచారు. తన కుమారుడు సినీ పరిశ్రమలో డైరెక్టర్ ఎదిగినప్పటికీ వెంకటేశ్వర్లు చౌదరి మాత్రం ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని తన స్వగ్రామం బొద్దులూరివారి పాళెంలోనే నివసిస్తున్నారు.

గోపీచంద్ మలినేని తండ్రి వెంకటేశ్వర్లు చౌదరి మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు గోపీచంద్ మలినేనికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. గోపీచంద్ దర్శకుడిగా డాన్ శీను, పండగ చేస్కో, బలుపు, బాడీగార్డ్ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసారు.

123తెలుగు.కామ్ తరఫున గోపీచంద్ మలినేని తండ్రి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :