గోపీచంద్ కొత్త సినిమా రేపే ప్రారంభం !
Published on Nov 18, 2017 1:54 pm IST

‘ఆక్సిజన్’ సినిమా తరువాత గోపీచంద్ కథానాయకుడిగా నటించనున్న కొత్త చిత్రం రేపు ప్రారంభం కానుంది. నూతన దర్శకుడు చక్రి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయంకాబోతున్నాడు. దర్శకుడు బాబి దగ్గర జై లవకుశ సినిమాకు చక్రి రచయితగా పనిచేశారు. వినూత్న కథాంశంతో అన్ని వాణిజ్య హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

గతంలో ‘బెంగాల్ టైగర్’ సినిమా నిర్మించిన కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో మెహరిన్ హీరొయిన్ గా నటించబోతుంది. ఈ సినిమాకు సంభందించి ఇతర నటి నటుల సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో గోపీచంద్ మంచి విజయం సాదించాలని కోరుకుందాం.

 
Like us on Facebook