శ్రీను వైట్ల – గోపీచంద్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ అప్పుడే?

శ్రీను వైట్ల – గోపీచంద్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ అప్పుడే?

Published on Mar 18, 2024 12:00 AM IST

టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో, కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వం లో తెరకెక్కిన భీమా చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. తదుపరి హీరో గోపీచంద్ శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లో కనిపించనున్నారు. భీమా ప్రమోషన్స్ లో భాగం గా ఈ చిత్రం కి సంబందించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను కూడా గోపీచంద్ వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 30 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు తెలిపారు.

అయితే ఈ చిత్రం కి సంబందించిన టైటిల్ ను ఉగాది పండుగ సందర్భంగా రివీల్ చేయనున్నట్లు సమాచారం. టైటిల్ గ్లింప్స్ వీడియో ను ఉగాది పండుగ కి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రం తో పాటుగా, SVCC బ్యానర్ లో ఒక చిత్రాన్ని, రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో, యూవీ క్రియేషన్స్ పతాకంపై మరొక చిత్రం ను చేయనున్నారు. త్వరలో వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు