గోపీచంద్ పంతం ఫస్ట్ లుక్ విడుదల !

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా పంతం. కె.చక్రవర్తి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. గోపీచంద్ మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో ఎన్ఆర్ఐ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య విలువల్ని మేళవించి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెహరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. మే 18న ఈ సినిమాను విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కొత్తరకమైన స్క్రీన్ ప్లే తో సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.