త్వరలో తండ్రి కానున్న గోపీచంద్.!

త్వరలో తండ్రి కానున్న గోపీచంద్.!

Published on Oct 7, 2014 1:29 PM IST

gopichand
టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ ‘లౌక్యం’ సినిమా మంచి విజయం సాధించడంతో చాలా ఆనందంగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ తన రియల్ లైఫ్ లో కూడా చాలా హ్యాపీ గా ఉన్నాడు. ఎందుకంటే గోపీచంద్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ప్రతి వారికి ఈ విషయం ఎంతో ఆనందదాయకమైనది మరియు నూతన ఉత్తేజాన్ని కలిగించే విషయం.

గత సంవత్సరమే గోపిచంద్ హీరో శ్రీకాంత్ కి బంధువులైన రేష్మని పెళ్లి చేసుకున్నారు. గోపీచంద్ ఈ రోజు నుంచి లౌక్యం విజయ యాత్రలో పాల్గొంటున్నాడు. ఇది కాకుద్నా గోపీచంద్ హీరోగా రాదాకృష్ణ డైరెక్టర్ గా చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. యువి క్రియేషన్స్ బ్యానర్ వారు ఆ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు