గోపిచంద్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.3 ప్రారంభం

గోపిచంద్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.3 ప్రారంభం

Published on May 30, 2014 4:12 PM IST

Gopichand_new-movie
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి వంటి బ్లాక్ బస్టర్ తో తొలి ప్రయత్నమే సూపర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై,
ప్రొడక్షన్ నెం.3 చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు యువి క్రియేషన్స్ సంస్థ ఆఫీసులో సినీ ప్రముఖుల సమక్షంలో జరిగాయి. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ గోపిచంద్ హీరోగా నటిస్తున్నారు.
ఈ పూజా కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ప్రముఖ నిర్మాత దిల్ రాజు హీరో గోపిచంద్ నిర్మాతలతో పాటు ప్రముఖ నటీనటులు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
ముందుగా ఈ కార్యక్రమంలో దేవుడి పటాలపై నిర్మాత దిల్ రాజు క్లాప్ నివ్వగా…యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మట్లాడుతూ…యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మిర్చి చిత్రంతో ప్రారంభమైన మా యువి క్రియేషన్స్ బ్యానర్ పై యాక్షన్ కింగ్ గోపిచంద్ హీరోగా అత్యున్నత సాంకేతిక నిపుణులతో
భారీ తారాగణంతో చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్ర ప్రారంభోత్సవం మా సంస్థ ఆఫీసులో ప్రముఖ సినీ ప్రముఖుల సమక్షంలో ఈరోజు జరిగింది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన
రాధా కృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. జూన్ 6 నుంచి, జూన్ 21 వరకు మొదటి షెడ్యూల్ జరుపుకుంటాం. అన్ని కమర్షియల్ హంగులతో యాక్షన్ ఓరియెంటెడ్ గా ఈ చిత్రం రూపొందిస్తాం. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్ మహతి
సంగీతమందిస్తున్నారు. అని అన్నారు.

నటీనటులు – గోపిచంద్, చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబి అంజలి, కల్పలత, మౌళిక,

సాంకేతిక వర్గం
కాస్ట్యూమ్ డిజైనర్ – తోట విజయ్ భాస్కర్
ఆర్ట్ డైరెక్టర్ – ఎ.ఎస్.ప్రకాష్
యాక్షన్ డైరెక్టర్ – అనల్ అరసు
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావ్
డైరెక్టర్ ఆఫ్ ఫొటొగ్రఫి – శక్తి శరవణన్
మ్యూజిక్ – సాగర్ మహతి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – ఎమ్.అశోక్ కుమార్ రాజు, ఎన్.సందీప్
ప్రొడ్యూసర్స్ – వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – రాధా కృష్ణ కుమార్

తాజా వార్తలు