తమిళ డైరెక్టర్ కు అండగా నిలిచిన ‘విన్నర్’ దర్శకుడు !

Published on Oct 28, 2018 11:30 pm IST

‘సర్కార్’ కథ నాదేనంటూ నా కథ ను కాపీ చేశాడని చిత్ర దర్శకుడు మురగదాస్ ఫై కోర్టు లో కేసు వేశాడు రచయిత వరుణ్ రాజేంద్రన్. ఇక ఈ విషయంలో రచయితల సంఘం కూడా వరుణ్ కే మద్దతుగా నిలిచింది. దాంతో నిరాశ చెందిన మురుగదాస్ కు ఆయన దగ్గర పనిచేశే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇతర టెక్నిషయన్స్ అండగా నిలిచారు. ఇక తాజాగా ఈ విషయంలో ‘విన్నర్’ దర్శకుడు గోపిచంద్ మలినేని కూడా ఆయన కు మద్దతు తెలిపారు.

మురుగదాస్ గారి దగ్గర నేను ‘స్టాలిన్’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాను. సినిమా పట్ల ఆయనకు వున్నా కమిట్మెంట్ ను చూసి ఆశ్చర్యపోయాను. అంకిత భావంతో పనిచేసే వ్యక్తి . ఆయన దగ్గర నుండి సెట్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన నిజాయితీగల వ్యక్తి అని గోపిచంద్ మలినేని , మురుగదాస్ ఫై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

సంబంధిత సమాచారం :