రొమాంటిక్ సాంగ్ కోసం ‘చాణ‌క్య‌’ !

Published on Aug 12, 2019 9:51 am IST

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ‘చాణ‌క్య‌’. ఇటివలే టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. కాగా తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో మిగిలిన మూడు సాంగ్స్ ను చిత్రీకరిస్తున్నారు చిత్రబృందం. కాగా ఈ షెడ్యూల్ లో ఇప్పుడు రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేస్తున్నారట. ఈ సాంగ్ కోసం గోపీచంద్ ఇప్పటికే డ్యాన్స్ మూమెంట్స్ ను కూడా ప్రాక్టీస్ చేశాడట. ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో గోపీచంద్‌ సరసన మెహ‌రీన్ జ‌త‌గా న‌టిస్తోంది.

కాగా ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :