
‘జిల్’ సినిమాలో స్టైలిష్ యాక్షన్‌తో మనల్ని మెప్పించిన హీరో గోపీచంద్ తన తాజా చిత్రం షూటింగ్‌లో బిజీగా మారిపోయాడు. ప్రముఖ మాస్ సినిమాల దర్శకుడు బి. గోపాల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టి. రమేష్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. మొదట ఈ సినిమాకు ఓ తమిళ దర్శకుడిని ఓకే చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన స్థానంలో బి. గోపాల్ వచ్చారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కోకాపేట పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ షూటింగ్‌లో తాజాగా హీరోయిన్ నయనతార కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. నయనతార రెండేళ్ళ తర్వాత చేస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. జూలై నెలలో ఈ సినిమాను విడుదల చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

