సునీల్ కి మంచి కామెడీ క్యారెక్టర్ దొరికిందట !

Published on Jul 5, 2020 11:45 pm IST

గోపీచంద్‌ ప్రస్తుతం చేస్తోన్న సినిమా ‘సిటీమార్’. సంపత్‌ నంది డైరెక్షన్ లో రాబోతున్న ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కామెడీ కోసం కోచ్ అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని తెలుస్తోంది. ఆ పాత్రలో సునీల్ నటిస్తున్నాడట. చాల కాలం తరువాత సునీల్ కి మంచి కామెడీ క్యారెక్టర్ దొరికిందట. మరి సునీల్ కి ఈ చిత్రంతో దశ తిరుగుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది.

వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ వెరీ ఇంట్రస్ట్ గా ఉంటుందట. అయితే ఈ సినిమాలో కొన్ని చోట్ల ఓవర్ గా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయటం సాధ్యం కాదని వాటిని తొలిగిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే సినిమాలో యాక్షన్ తగ్గించి పక్కా కామెడీ అంశాలను హైలెట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అయితే గోపీచంద్ ఎన్నో ఆశలతో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి సూపర్ హిట్ ఇవ్వాలనే కసితో బాగా పట్టుదలగా ఉన్నాడట సంపత్ నంది. మరి ఈ సారి ఈ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More