చైతు-సమంతల రిసెప్షన్ డేట్ ఫిక్స్ ?
Published on Nov 2, 2017 3:12 pm IST

నాగ చైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6న బ్రహ్మండంగా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ వివాహ పద్దతుల్లో జరిగిన ఈ వేడుకలో అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులతోపాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. గతకొన్ని రోజుల క్రితం చెన్నై లో వీరి రిసెప్షన్ కూడా జరిగింది. దానికి కూడా దగ్గరి బందు మిత్రులు హాజరు అయ్యారు. అయితే ఈసారి జరగబోయే రిసెప్షన్ అందరి కోసం అన్నట్లు హైదరాబాద్ లో ఘనంగా జరగబోతుంది. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొనున్నారు.

తాజా సమాచారం మేరకు నవంబర్ 12న హైదరాబాద్ లో వీరి రిసెప్షన్ జరగబోతుందని తెలుస్తోంది. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. ప్రస్తుతం సమంత ‘రంగస్థలం’ సినిమాలో నటిస్తుండగా నాగ చైతన్య చందు మొండేటి, మారుతి దర్శకత్వంలో నటించబోతున్నాడు.

 
Like us on Facebook