మిస్టర్ బాక్సాఫీస్ బర్త్ డే కు గట్టి వేడుకలే..!

Published on Mar 18, 2021 3:00 pm IST

అభిమానులు అంతా మిస్టర్ బాక్సాఫీస్ గా పిలుచుకునే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈ మార్చ్ 27న అన్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా చరణ్ చేస్తున్న ప్రతీ ఒక్క ప్రాజెక్ట్ కూడా మంచి హై లో ఉంది. అయితే మరి ఓ స్టార్ హీరో పుట్టినరోజు వేడుకలు అంటే మన తెలుగు నాట ఏ రేంజ్ లో చేస్తారో తెలిసిందే కదా అలా చరణ్ పుట్టినరోజును కూడా ఘనంగా మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మెగా ఫ్యాన్స్ ఆఫ్ లైన్ లో గట్టిగా చెయ్యనున్నారు. మరి అందరికీ రీచ్ అయ్యే విధంగా గతంలో మెగాస్టార్ చిరు బర్త్ డే ను ఎలా చేసారో అదే రీతిలో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ చరణ్ పుట్టినరోజును చేస్తున్నారు. ఈ నెల 26న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ఒక గ్రాండ్ ఈవెంట్ కు ఆల్రెడీ పనులు సన్నాహం అయ్యినట్టు తెలుస్తుంది. అలాగే వేడుకకు గాను మెగా కుటుంబం నుంచి కొందరు హీరోలు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. మరి ఈ గ్రాండ్ ఈవెంట్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :