ప్రియాంకా మోహన్ చేతుల మీదుగా అల్లకాస్ మాల్ ప్రారంభోత్సవం

ప్రియాంకా మోహన్ చేతుల మీదుగా అల్లకాస్ మాల్ ప్రారంభోత్సవం

Published on Sep 23, 2025 7:00 PM IST

Priyanka Mohan 3

హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో, కాళీమాత మందిర్ మెయిన్ రోడ్‌లో అల్లకాస్ అనే కొత్త ఫ్యామిలీ షాపింగ్ మాల్ ప్రారంభమైంది. నాలుగు అంతస్తుల వైభవంగా రూపుదిద్దుకున్న ఈ మాల్, కేవలం షాపింగ్ కోసం మాత్రమే కాదు, ట్రెండీ ఫ్యాషన్‌కు నూతన ప్రతీకగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

శరన్నవరాత్రుల సందర్భంగా జరిగిన ఈ ప్రారంభోత్సవానికి OG సినిమా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ టి. ప్రకాశ్ గౌడ్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ శ్రీ శరత్ చంద్ర పాల్గొని అల్లకాస్ మాల్ బృందాన్ని అభినందించారు.
అల్లకాస్ షాపింగ్ మాల్‌లో కిడ్స్, మెన్, ఉమెన్ విభాగాలకు సంబంధించిన వస్త్రాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

Priyanka Mohan 2 1

సంబంధిత సమాచారం

తాజా వార్తలు