సవ్యసాచి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానున్న గెస్టులు ఎవరంటే !

Published on Oct 27, 2018 3:56 pm IST

యువ సామ్రాట్ నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా జరుపనున్నారు. ఇక ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా టాప్ డైరెక్టర్స్ సుకుమార్ , కొరటాల శివ తోపాటు యువ హీరో విజయ్ దేవరకొండ హాజరుకానున్నారు. ఈ ముగ్గరితో ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సినిమాలను నిర్మించింది.

ఇక ఈచిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన సీనియర్ హీరో మాధవన్ కూడా ఈ ఈవెంట్ కు రానున్నాడు. ‘ప్రేమమ్’ ఫేమ్ చందూ మొండేటి తెరెకెక్కించిన ఈచిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా కీరవాణి సంగీతం అందించారు. నవంబర్ 2న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం :