బయోపిక్ కి కావాల్సినంత డ్రామా యువీ లైఫ్ లోనే ఉంది !

Published on Mar 26, 2020 1:00 am IST

క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు ‘యువరాజ్ సింగ్’ది. 2007 T20 వరల్డ్ కప్ అలాగే 2011 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది అనే కంటే.. ‘యువరాజ్ సింగ్’ గెలిపించాడు అనడం కరెక్టేమో. యువీ రిటైర్మెంట్ బాధ కలిగించే అంశమే. భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించిన ఓ గొప్ప క్రికెటర్ టీంలో స్థానం కోల్పోయి.. కెరీర్ ను ముగించడం క్రికెట్ ప్రేమికులకు ఏ మాత్రం రుచించడం లేదు. యువీ కెరీర్ లో ఎన్నో నాటకీయ కోణాలు చోటు చేసుకున్నాయి.

కాగా బయోపిక్స్ సీజన్ భారతీయ సినిమా రంగంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. యువరాజ్ సింగ్ బయోపిక్ కూడా రాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. తిరుగులేని క్రికెటర్ గా కొనసాగుతున్న టైంలో క్యాన్సర్ వ్యాధి భారిన పడటం, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారత అభిమానుల కలలు కన్న ప్రపంచ కప్ ను సాధించ పెట్టడం, తన సహచర ఆటగాడైన దోనీ తనను జట్టులో నుండి తొలిగించి అవమానించడం.. వంటి ఎత్తుపల్లాలను చూశాడు యువీ.

బహుశా ఇంత డ్రామా ఏ క్రికెటర్ లైఫ్ లో జరిగి ఉండకపోవచ్చు. ఒక సినిమాకి కావాల్సినంత డ్రామా ఉన్న ‘యువీ’ లైఫ్ ఆధారంగా బయోపిక్ వస్తే.. అభిమానులతో పాటు భవిష్యత్తు క్రికెటర్ లకు కూడా ఆ చిత్రం ప్రేరణగా నిలుస్తోంది. మరి త్వరలోనే యువీ బయోపిక్ రానుంది. యువి జీవిత కథలో యువి పాత్రలో గల్లీ బాయ్ ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది నటిస్తున్నాడట.

సంబంధిత సమాచారం :

X
More