ఒంగోలు కుర్రాడి కథే ‘గుణ 369’ !

Published on May 22, 2019 11:02 pm IST

గత ఏడాది విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం అంత పెద్ద హిట్టవడానికి ప్రధాన కారణం అందులోని వాస్తవ కథే. దర్శకుడు అజయ్ భూపతి వాస్తవ ఘటన ఆధారంగా ఆ కథను రాసుకున్నాడు కాబట్టే సినిమాలో జీవం కనబడింది. ఈ ఫార్ములాను గట్టిగా నమ్మిన హీరో కార్తికేయ తన 3వ సినిమాకు కూడా అదే ఫాలో అయ్యారు. అర్జున్ జంధ్యాల చెప్పిన రియల్ లైఫ్ స్టోరీ నచ్చి అందులో ‘ఆర్ఎక్స్ 100’ ఛాయలు కనబడేసరికి నమ్మకముంచి ‘గుణ 369’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఒంగోలు జిల్లాకు చెందిన అర్జున్ జంధ్యాల ఒంగోలు ప్రాంతానికి చెందిన ఒక కుర్రాడి జీవితంలో జరిగిన ఘటనలు ఆధారంగా ఈ కథను తయారుచేశాడట. అందుకే సినిమాను 70 శాతం ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More