గుణ 369 ట్రైలర్: ప్రేమ కోసం హింస వైపు వెళ్లిన యువకుడి కథ

Published on Jul 17, 2019 12:11 pm IST

యంగ్ హీరో కార్తికేయ,అనఘా హీరో హీరోయిన్లుగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” గుణ369″. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తిరుమల రెడ్డి,అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొద్ది రోజులక్రితం విడుదలైన ఈ మూవీ టీజర్ కి మంచి ఆదరణ లభించింది. ఐతే నేడు చిత్ర యూనిట్ “గుణ 369” ట్రైలర్ విడుదల చేయడం జరిగింది.

గుణ 369 ట్రైలర్ రొమాన్స్ మరియు యాక్షన్ సన్నివేశాలను కలగలిపి ఆసక్తికరంగా కట్ చేశారు. హింస వలన గొడవల వలన ప్రశాంత కోల్పోతాం, అయినవారికి,కుటుంబ సభ్యులకు ప్రమాదాలు ఎదురవుతాయని శాంతి మార్గాన్ని ఎన్నుకున్న యువకుడిగా కార్తీక్ కనిపిస్తున్నారు. సెల్ ఫోన్ స్టోర్ లో పనిచేసే అమ్మాయిగా, హంబుల్ లేడీ గా హీరోయిన్ అనఘా కనిపిస్తుంది. అమ్మాయి ప్రేమకోసం అల్లరి చేష్టలు చేస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతున్న హీరో , హీరోయిన్ కి ఎదురైన ప్రమాదాలను నుండి కాపాడడానికి హింసా మార్గం ఎంచుకున్నాడు అనిపిస్తుంది.

ఆదిత్య మీనన్ మెయిన్ విలన్ గా కనిపిస్తుండగా,జబర్దస్త్ మహేష్ హీరో ఫ్రెండ్ గా కామెడీ పాత్రలో కనిపిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు అర్జున జంధ్యాల బాగానే తెరకెక్కించినట్లున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఏ సారి కార్తీక్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :