గ్లోబల్ రేంజ్ లో అదరగొట్టిన సూపర్ స్టార్ ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్

Published on Jun 3, 2023 1:01 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీని త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. దీనిని భారీ స్థాయిలో 2024 జనవరి 13న సినీ ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఇక రెండు రోజుల క్రితం ఈ మూవీ టైటిల్ తో పాటు యూట్యూబ్ లో రిలీజ్ అయిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ గ్లింప్స్ కి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ లభించింది.

ఇక ఈ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 25 మిలియన్స్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డు గా నిలిచింది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ టైటిల్, మాస్ స్ట్రైక్ గ్లింప్స్ గురించి అంతర్జాతీయంగా పేరుగాంచిన వెరైటీ పత్రికలో ఒక ఆర్టికల్ ప్రచురితం అయింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం గ్లింప్స్ ఈ విధంగా గ్లోబల్ గా క్రేజ్ సొంతం చేసుకోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మూవీని మాస్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :