‘గుంటూరు కారం’ : నా పాత్రని ఎంజాయ్ చేయలేకపోయానంటున్న వెర్సటైల్ యాక్టర్

‘గుంటూరు కారం’ : నా పాత్రని ఎంజాయ్ చేయలేకపోయానంటున్న వెర్సటైల్ యాక్టర్

Published on Apr 10, 2024 3:01 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. మహేష్ బాబు సూపర్ పెర్ఫార్మన్స్ తో పాటు థమన్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, కామెడీ, ఎమోషనల్ సీన్స్ కి ఆడియన్స్, సూపర్ ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇక ఈ మూవీలో డొక్కా మార్క్స్ బాబు పాత్రలో కనిపించారు వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు. అయితే ఈ మూవీలో తన పాత్రని ఎంజాయ్ చేయలేకపోయాను అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తెలిపారు జగపతిబాబు. నిజానికి మహేష్ మరియు నేను స్క్రీన్‌పై చాలా బాగా కలిసి పనిచేసాము, అలానే తనతో ఎప్పుడూ పని చేయాలనే కోరిక ఉంటుందని అన్నారు.

కానీ నిజాయితీగా మాట్లాడుకుంటే గుంటూరు కారం సినిమాలో తన పాత్రని ఎంజాయ్ చేయలేకపోయానని, తనకు మహేష్ బాబుకి మధ్య ఉన్న సీన్లను ఆస్వాదించలేకపోయానని, అలాంటి స్టార్ తో చేస్తే మంచి పాత్రనే చేయాలని, ఛాన్స్ వేస్ట్ చేసుకోకూడదన్నట్టుగా జగపతి బాబు మాట్లాడారు. ఇక గుంటూరు కారంలో తన పాత్ర చాలా గజిబిజిగా మారిందని కొంతకాలం తర్వాత దాని షూటింగ్ పూర్తి చేయడం నాకు చాలా కష్టంగా కూడా అనిపించిందని చెప్పుకొచ్చారు జగపతి బాబు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు