‘గుంటూరు కారం’ : ఫస్ట్ రిలీజ్ అయ్యేది ఆ సాంగ్ అట ?

Published on Sep 14, 2023 11:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేగంగా జరుగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ఫ్యామిలీ యాక్షన్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తుండగా యువ అందాల భామలు మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని రానున్న దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ టాలీవుడ్ ప్రకారం గుంటూరు కారం కి సంబంధించి ఇప్పటికే మూడు సాంగ్స్ ఫైనలైజ్ కాగా వాటిలో ముందుగా మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేయాలని భావిస్తోందట యూనిట్. గతంలో మహేష్ నటించిన సర్కారు వారి పాట నుండి మొదట మెలోడియస్ సాంగ్ కళావతి రిలీజ్ చేయగా దానికి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. అయితే ఈ సాంగ్ రిలీజ్ పై మేకర్స్ నుండి ప్రకటన రావాల్సి ఉంది. కాగా గుంటూరు కారం మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :