ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన థ్రిల్లర్ ‘కింగ్స్టన్’

ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన థ్రిల్లర్ ‘కింగ్స్టన్’

Published on Apr 13, 2025 2:01 PM IST

ప్రస్తుతం తెలుగు సహా తమిళ్ లో వరుస సినిమాలతో సంగీత దర్శకునిగా దూసుకెళ్తున్న టాలెంటెడ్ కంపోజర్ జీవి ప్రకాష్ కేవలం సంగీత దర్శకునిగా మాత్రమే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అలా తాను నటించిన లేటెస్ట్ చిత్రమే “కింగ్స్టన్”. దర్శకుడు కమల్ ప్రకాష్ తెరకెక్కించిన ఈ సముద్రపు బ్యాక్ డ్రాప్ హారర్ థ్రిల్లర్ తెలుగులో సహా తమిళ్ లో కూడా మరీ అంతగా రాణించలేదు.

అయితే ఇపుడు ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసింది. ఈ చిత్రాన్ని జీ వారు సొంతం చేసుకోగా అందులో నేటి నుంచి తెలుగు మరియు తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి అప్పుడు చూడకుండా మిస్ అయ్యినవారు ఇపుడు ఓటిటిలో చూడాలి అనుకుంటే చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి కూడా జీవి ప్రకాష్ నే సంగీతం అందించుకోగా పార్లెల్ యూనివర్స్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు