క్యాన్సర్‌ తో పోరాడుతున్న ప్రభాస్ హీరోయిన్ !

క్యాన్సర్‌ తో పోరాడుతున్న ప్రభాస్ హీరోయిన్ !

Published on Dec 20, 2021 10:58 AM IST

హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ గర్ల్ గా పలు చిత్రాల్లో నటించి అలరించిన ‘హంస నందిని’కి క్యాన్సర్‌ సోకింది. తాను రొమ్ము క్యాన్సర్‌ గ్రేడ్-3తో బాధపడుతున్నట్లు స్వయంగా ఆమెనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె కీమో థెరపీ చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తన మెసేజ్ లో స్పష్టం చేశారు. తాజాగా ఈ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేస్తూ.. క్యాన్సర్ తో పోరాడుతున్నానని, కీమోథెరపీ కారణంగా జుట్టు మొత్తం కోల్పోయానని కూడా ఆమె చెప్పడం నెటిజన్లను కదిలించింది.

అలాగే ఆమె షేర్ చేసిన ఫొటోలో పూర్తి గుండుతో కనిపించింది. అసలు ఈ క్యాన్సర్ గురించి ఎప్పుడు బయట పడింది అంటే.. నాలుగు నెలల క్రితం తన బ్రెస్ట్ లో లంప్ ఉన్నట్లుగా హంసానందిని గుర్తించింది. వెంటనే వెళ్లి డాక్టర్స్ ని సంప్రదించింది. పలు టెస్ట్ లు చేయించుకున్న తర్వాత ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది.

ఇక కొన్నేళ్లక్రితం తన తల్లి కూడా క్యాన్సర్ తో చనిపోయిందని.. అప్పటిరోజులను గుర్తుచేసుకుంటూ హంసానందిని ఎమోషనల్ అయింది. ఆమె త్వరగా క్యాన్సర్ నుంచి బయట పడాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు