
‘గజిని’ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో సూర్యను తెలుగులో స్టార్‌ను చేసిన సినిమాలు.. ‘సింగం'(యముడు), ‘సింగం 2′(సింగం). తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌లో మూడో సినిమాగా ‘సింగం 3’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దర్శకుడు హరి ఈ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారన్న విషయం ఇంకా కన్‌ఫర్మ్ కాలేదు. ‘సింగం’లో అనుష్క హీరోయిన్‌గా నటించగా, ‘సింగం 2’లో అనుష్క, హన్సిక ఇద్దరు నటించారు. మరి ఈ కొత్త సీక్వెల్‌లో ఎవరెవరు నటించనున్నారన్నది ఇంకా తెలియలేదు. అయితే ‘సింగం 3’ కోసం శృతి హాసన్, హన్సికలను దర్శకుడు సంప్రదించారని ప్రచారం జరిగింది.
ఈ ప్రచారాలపై హన్సిక తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా స్పందించింది. “ఇప్పటివరకూ ‘సింగం 3’ గురించి ఎవరూ నన్ను సంప్రదించలేదు. అవన్నీ పుకార్లే” అంటూ చెప్పుకొచ్చింది. హన్సిక ఈ ప్రకటన ఇవ్వడంతో మళ్ళీ ‘సింగం 3’లో హీరోయిన్‌గా నటించేది ఎవరన్నది హాట్ టాపిక్‌గా మారిపోయింది.

