సుందర్ సి దర్శకత్వంలో విశాల్, హన్సిక జంటగా నటిస్తున్న సినిమా ‘అంబాల’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో హన్సిక ఎడమ చేతిని ఒక తేనెటీగ కుట్టింది. విపరీతమైన పెయిన్ తో పాటు ఎడమ చేయి బాగా వాచిందని సమాచారం. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న హన్సిక తిరిగి షూటింగ్ లో పోల్గొందట. యూనిట్ సభ్యులు విశ్రాంతి తీసుకోమని వారించినా తన వల్ల షూటింగ్ ఆగడం ఇష్టం లేదని కంటిన్యూ చేసింది.
వర్క్ పట్ల హన్సిక డెడికేషన్ చూసిన యూనిట్ సభ్యులు ఆమెను ప్రశంసలలో ముంచెత్తారు. ప్రస్తుతం హన్సిక చేతిలో 8 తమిళ సినిమాలు ఉన్నాయి. తెలుగులో ఈ అమ్మడు నటించిన చివరి సినిమా ‘పవర్’ హిట్టయ్యింది. వరుస తమిళ సినిమా అవకాశాలతో మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేకపోయింది.


