అభిమానుల కోసమే గ్లామర్ పాత్రలు చేస్తున్నా – హన్సిక

అభిమానుల కోసమే గ్లామర్ పాత్రలు చేస్తున్నా – హన్సిక

Published on May 15, 2014 8:43 AM IST

Hansika
చాలా చిన్నతనంలోనే ‘దేశముదురు’ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమై అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ ‘హన్సిక’. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో బాగా బిజీ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ అభిమానుల సంతోషం కోసం ఎన్ని కష్టాలైనా పడతానని, నా అభిమానుల కోసమే గ్లామరస్ పాత్రలు చేస్తున్నానని అంటోంది.

‘నా కెరీర్ మొదటి నుంచి స్పీడుగానే ఉంది. సినిమాని సినిమాగా చూడటం నేర్చుకున్నా అందుకే సినిమాలో ఎవరు హీరో? బడ్జెట్ ఎంత? అనేది చూడను. కథను నమ్మి సినిమా చేస్తాను. అలాగే నా అభిమానులు నన్ను ఒక కుందనపు బొమ్మలా చూడాలనుకుంటారు. అభిమానుల ఆశల్ని తీర్చడం తప్ప ఇవ్వగలను అందుకే వారి కోసమే గ్లామరస్ పాత్రలు చేస్తున్నాని’ హన్సిక చెబుతోంది.

ప్రస్తుతం హన్సిక తెలుగులో రవితేజ సరసన ‘పవర్’ సినిమాలో నటిస్తోంది. అది కాకుండా తమిలో చాలా సినిమాలు చేస్తోంది.

తాజా వార్తలు