ఓటిటిలో ఆ మూడు భాషల్లో అందుబాటులోకి వచ్చిన ‘హను మాన్’

ఓటిటిలో ఆ మూడు భాషల్లో అందుబాటులోకి వచ్చిన ‘హను మాన్’

Published on Apr 5, 2024 9:00 PM IST

యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ హను మాన్. ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో వెన్నెల కిషోర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు చేశారు.

అటు థియేటర్స్ లో అదరగొట్టిన ఈ మూవీ ఇప్పటికే జియో సినిమాలో హిందీ, జీ 5 లో తెలుగు వర్షన్ ఓటిటి లో కూడా అందుబాటులోకి వచ్చి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. విషయం ఏమిటంటే, తాజాగా హను మాన్ మూవీ తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో డిస్నీ హాట్ స్టార్ ఆడియన్స్ ముందుకి వచ్చింది. కాగా ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు