“హను మాన్” ఓటిటి.. ఫైనల్ గా దర్శకుడు మాటే మీదే

“హను మాన్” ఓటిటి.. ఫైనల్ గా దర్శకుడు మాటే మీదే

Published on Mar 10, 2024 5:03 PM IST

ఇటీవల టాలీవుడ్ సినిమా నుంచి వచ్చి పాన్ ఇండియా సెన్సేషన్ ని రేపిన భారీ చిత్రం “హను మాన్”. మరి మన తెలుగు సినిమా నుంచి వచ్చిన మొట్ట మొదటి సూపర్ హీరో సినిమా కావడంతో మంచి బజ్ నడుమ వచ్చిన ఈ చిత్రం హీరో తేజ సజ్జ దర్శకుడు ప్రశాంత్ వర్మ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యి ఆశ్చర్యకరంగా ఇప్పుడు సినిమా ఇంకా థియేటర్స్ లో వీకెండ్ లేదా పండుగ హాలిడే వచ్చినా అదరగొడుతుంది.

అయితే ఈ క్రమంలో హను మాన్ ఓటిటి రిలీజ్ పై కూడా మంచి డిమాండ్ నెలకొంది. కానీ ఇంకా సినిమా సౌత్ వెర్షన్స్ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే హిందీ వెర్షన్ కి ఈ మార్చ్ 16 లాక్ అయ్యింది. ఈ మార్చ్ 16 చూసుకున్నా సరే 60 రోజులు తర్వాతనే ఓటిటిలో ఈ చిత్రం వస్తుంది అని చెప్పాలి.

మరి ఈ 60 రోజుల టాపిక్ కోసం చూస్తే.. ఈ చిత్రం రిలీజ్ కి ముందే ప్రమోషన్స్ ఇస్తున్న సమయంలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా క్లియర్ గా హను మాన్ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎవరూ ఎదురు చూడవద్దని ఈ సినిమా మినిమమ్ 60 రోజులు వరకు ఓటిటిలో రాదని చెప్పేసాడు.

కానీ ప్రస్తుతం ఉన్న ఓటిటి ట్రెండ్ లో అలా చెప్పినా కూడా కొంచెం ముందే వచ్చిన చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ హను మాన్ మాత్రం దర్శకుడు చెప్పినట్టు గానే 60 రోజులు తర్వాతే వస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా తెలుగు మరియు సౌత్ వెర్షన్స్ ఓటిటి డేట్ కోసం ఇప్పుడు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు