డే 9 నైజాంలో బిగ్గెస్ట్ నెంబర్ అందుకున్న “హను మాన్”

డే 9 నైజాంలో బిగ్గెస్ట్ నెంబర్ అందుకున్న “హను మాన్”

Published on Jan 21, 2024 2:00 PM IST

Hanu Man 3

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ అలాగే టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “హను మాన్” ఇప్పుడు ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూస్తూనే ఉన్నాము. రిలీజ్ చేసిన ప్రీమియర్స్ డే నాటి నుంచి ఇప్పుడు వరకు కూడా హను మాన్ భారీ వసూళ్లు కొల్లగొడుతూ ఉండగా ఇప్పుడు మొత్తం 9 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఇప్పుడు నైజాం లో హను మాన్ మాసివ్ నెంబర్ ను అందుకుంది.

రిలీజ్ అయ్యిన 9 రోజులు కూడా సూపర్ పెర్ఫామెన్స్ ని కనబరిచిన ఈ చిత్రం ఈ అన్ని రోజుల్లో కూడా 9వ రోజు అన్నిటికన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టడం విశేషం. మరి ఈ డే 9 కి గాను హను మాన్ 2.6 కోట్ల షేర్ ని రాబట్టింది. దీనితో మొత్తం ఈ 9 రోజుల్లో ఈ చిత్రం 19.35 కోట్ల షేర్(జి ఎస్ టి కలిపి) రాబట్టి అదరగొట్టింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి గౌర హరీష్ సంగీతం అందించగా నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు