రీసెంట్ బ్లాక్ బస్టర్ “హను మాన్” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

రీసెంట్ బ్లాక్ బస్టర్ “హను మాన్” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

Published on Apr 17, 2024 11:22 AM IST

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్ (Hanuman). ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఏప్రిల్ 28, 2024 న సాయంత్రం 5:30 గంటలకు ప్రముఖ టీవీ ఛానల్ అయిన జీ తెలుగు లో హను మాన్ ప్రసారం కానుంది. అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం టీవీ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు