నేడు బాపు పుట్టినరోజు

నేడు బాపు పుట్టినరోజు

Published on Dec 15, 2011 10:40 AM IST


ఆ అమ్మాయి ‘అచ్చం బాపు బొమ్మలా ఉంది’ అని ఎవరైనా అంటే. ఒక తెలుగు అమ్మాయికి ఇంతకు మించిన పొగడ్త ఉండదంటే అతిశయోక్తి కాదేమో.బాపు గారు తన సినిమాలో హీరోయిన్ ను అచ్చ తెలుగు అమ్మాయిలా చూపిస్తారు అనే దానికి ఇదే ఉదాహరణ. ఈ లెజెండరీ దర్శకుడికి నేటితో 78 వసంతాలు నిండాయి.

ఆయన డిసెంబరు 15న 1933 సంవత్సరంలో పశ్చిమ గోదావరిలోని నర్సాపురులో జన్మించారు. ఆయన అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ 1945 లో ఆంధ్ర పత్రికలో రాజకీయ కార్టూనిస్టుగా తన ప్రస్థానం మొదలు పెట్టారు. చిత్రాలు గీయడంలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు. తన చిత్రాలలో పూర్తి తెలుగుతనం, తెలుగు సంప్రదాయం ఉండేలా చూపించేవారు.

తన చిరకాల మిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణతో కలిసి తన మార్కు స్టైలు ఎన్నో చిత్రాలు తీసి చూపించారు. సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, ముత్యాల ముగ్గు, శ్రీ రామాంజనేయ యుద్ధం, రాధా కళ్యాణం, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం మొదలైన గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన ఇటీవలే ‘శ్రీ రామరాజ్యం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అబ్బురపరిచారు.

123తెలుగు.కాం తరపున బాపు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు