
‘లెజెండ్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ భామ సోనాల్ చౌహన్, తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ సినిమా విజయం తర్వాత సోనాల్‌కు వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారిపోయింది సోనాల్ చౌహాన్. తాజాగా ఆమె నటించిన సినిమా పండగ చేస్కో సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే.
రామ్ హీరోగా తెరకెక్కిన పండగ చేస్కో సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టుతో పాటు పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న రొమాంటిక్ కామెడీ సైజ్ జీరో సినిమాలోనూ సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనాల్‌కు టాలీవుడ్ బాగా నచ్చిందట. త్వరలోనే తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తానని తెలిపింది. నేడు (మే 16న) సోనాల్ చౌహన్ తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెబుదాం.

