
శ్రీను వైట్ల – కోన వెంకట్ అనే కాంబినేషన్ అనగానే డీ, రెడీ, దూకుడు లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ గత కొద్ది రోజులుగా వీరి మధ్య దూరం పెరిగింది. వీరి కాంబినేషన్ లో సినిమాలు కూడా రాలేదు. దానికి కారణం ‘బాద్షా’ సినిమా టైంలో వీరిమధ్య మనస్పర్ధలు రావడమే.. కానీ ఆ గ్యాప్ కి బ్రేక్ ఇస్తూ వీరిద్దరూ కలిసి మళ్ళీ పనిచేయనున్నారు. మళ్ళీ శ్రీను వైట్లతో కలిసి పనిచేయనుండడం చాలా ఆనందంగా ఉందని కోన వెంకట్ అంటున్నారు. మెగా పవర్స్ తర రామ్ చరణ్ హీరోగా నటించనున్న సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ మొదలు కానుంది.
ఈ విషయంలో కోన వెంకట్ గతంలో మళ్ళీ శ్రీను వైట్లతో కలిసి పనిచేయను అని అకూడా చెప్పాడు. ఆ తర్వాత వేరే దర్శకులతో లౌక్యం, పవర్, గీతాంజలి లాంటి హిట్ సినిమాలకు పనిచేసాడు. అలాంటి వారిద్దరిని కలిపిన క్రెడిట్ రామ్ చరణ్ కి దక్కింది. రామ్ చరణ్ ‘సినీ ప్రపంచంలో వ్యక్తుల కంటే ఇండస్ట్రీ పెద్దదని, ఒక సక్సెఫుల్ సినిమా కొన్ని వందల కుటుంబాలకు ఫుడ్ పెడుతుందని’ చెప్పారు. ఈ మాటలతో కన్విన్స్ అయిన వీరిద్దరూ కలిసి పనిచేయడానికి సముఖత చూపారు. దీంతో శ్రీను వైట్ల మరో సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది.

