ఈ వేసవిలో రానున్న హ్యాపీ వెడ్డింగ్ !
Published on Feb 13, 2018 8:52 pm IST

సుమంత్ అశ్విన్, నీహారిక హీరో హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా హ్యాపీ వెడ్డింగ్. పాజిటివ్ గా ఉన్న ఈ టైటిల్ అందరి దృష్టిని ఆకర్షించింది. యు వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు ఉదయం 7 గంటలకు విడుదల చెయ్యబోతున్నారు. లక్ష్మణ్ కార్య ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. రైటర్ భవాని ప్రసాద్ రచయితగా పని చేస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాలో నరేష్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంఅందిస్తోన్న ఈ సినిమా నీహారిక చేస్తోన్న రెండో సినిమా అవ్వడం విశేషం. సుమంత్ అశ్విన్ కెరిర్ కు ఈ సినిమా హెల్ప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 
Like us on Facebook