షూటింగ్ పూర్తి చేసుకున్న హ్యాపీ వెడ్డింగ్ !

షూటింగ్ పూర్తి చేసుకున్న హ్యాపీ వెడ్డింగ్ !

Published on Feb 3, 2018 4:17 PM IST

ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన నీహారిక గ్యాప్ తర్వాత రెండో సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. హ్యాపీ వెడ్డింగ్ పేరుతొ తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమా లవ్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా రూపొందింది. లక్ష్మణ్ డైరక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

సమాజానికి దగ్గరగా ఉండే కథ కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 14 న విడుదల కానుందిదేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి మ్యూజిక్ అందిస్తున్నాడు. సుమంత్ అశ్విన్ గతంలో నటించిన రైట్ రైట్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు అలాగే నీహారిక నటించిన ఒక మనసు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు కావున వీరిద్దరి ఆశలు ఈ సినిమాపైనే ఉన్నాయి. రైటర్ భవాని ప్రసాద్ ఈ సినిమాకు సంభాషణలు సమకూర్చాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు