వాల్మీకి తో దర్శకుడి గోదారి కల నెరవేరిందట.

Published on Aug 28, 2019 6:00 pm IST

దర్శకుడు హరీష్ వాల్మీకి చిత్ర షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. వచ్చేనెల 20న విడుదల నేపథ్యంలో ఆయన మిగిలిన పాటలతో పాటు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ప్రస్తుతం వాల్మీకి చిత్ర షూటింగ్ గోదావరి నదిలో జరుగుతుందట. దర్శకుడు హరీష్ శంకర్ గోదావరి దగ్గర కాదు, గొడవారిలోనే షూటింగ్ చేస్తున్నాం, నాకల నెరవేరింది అంటూ ట్వీట్ చేశారు.

వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో అధర్వ కీలకపాత్ర చేస్తున్నారు. 14రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 13న విడుదల కావాల్సివుండగా 20కి వాయిదా పడింది.

సంబంధిత సమాచారం :