పవన్ “హరిహరవీరమల్లు” నుంచి పవర్ ప్యాక్డ్ సర్‌ప్రైజ్..!

Published on Apr 9, 2022 8:16 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చారిత్రక నేపధ్యంలో తెరక్కుతున్న చిత్రం “హరిహరవీరమల్లు”. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎమ్.రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సాగుతుండగా.. ఇటీవల కొన్ని యాక్షన్ స్టిల్స్ ఫోటోలను పంచుకున్న చిత్ర బృందం తాజాగా యాక్షన్ మూమెంట్స్ వీడియోను విడుదల చేసింది.

“ది వారియర్స్ వే” పేరుతో వచ్చిన ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ చేసిన విన్యాసాలు, లుక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. చివరలో పవన్ కళ్యాణ్ గాల్లోకి ఎగిరి ప్రత్యర్థిని కొట్టే సీన్ అదిరిపోయిందని చెప్పాలి. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ టోడర్ లాజరోవ్ నేతృత్వంలో ఈ సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :