ఫోటో మూమెంట్: “హరిహర వీరమల్లు” దర్శక నిర్మాతలతో పవర్ స్టార్!

Published on Feb 27, 2022 10:34 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం ను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించడం జరిగింది. ఈ చిత్రం ఫిబ్రవరి 25 వ తేదీన భారీగా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీ ను నిర్వహించడం జరిగింది. ఈ పార్టీ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా, మిగతా దర్శకులు, నిర్మాతలు సైతం పాల్గొన్నారు.

భీమ్లా నాయక్ చిత్రం విజయం సాధించడం పట్ల దర్శకులు, నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం అయిన హరిహర వీరమల్లు చిత్రం దర్శక నిర్మాతలు సైతం ఈ సక్సెస్ పార్టీ లో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ మరియు నిర్మాత ఏ.ఎం రత్నం లతో దిగిన ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. భీమ్లా నాయక్ చిత్రం లో మరొక హీరోగా రానా దగ్గుపాటి నటించగా, నిత్య మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :