కళ్యాణ్ రామ్ సినిమాలో ఎన్టీఆర్, హరికృష్ణ ?
Published on Feb 20, 2018 8:36 am IST

ప్రస్తుతం ‘ఎం.ఎల్.ఏ, నా నువ్వే’ వంటి సినిమాల్లో నటిస్తున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన తర్వాతి సినిమాను పవన్ సాదినేని దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ, సోదరుడు ఎన్టీఆర్ ఇద్దరూ ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

 
Like us on Facebook