వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్…అల్లరి నరేష్ సినిమా పై హరీష్ శంకర్ కామెంట్స్

Published on Apr 10, 2022 10:02 pm IST

చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత నాంది చిత్రం తో సాలిడ్ హిట్ కొట్టారు అల్లరి నరేష్. తర్వాత చిత్రాలు కూడా కంటెంట్ బేస్డ్ మూవీస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు నరేష్. శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా నేడు తన 59 వ చిత్రాన్ని ప్రకటించారు నరేష్. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. టైటిల్ అనౌన్స్ మెంట్ తోనే ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ మేరకు చిత్రం టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటూ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. సరికొత్త స్క్రిప్ట్ ల ద్వారా మిమ్మల్ని మీరు పునర్నిర్వచించుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చారు. హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హాస్య మూవీస్ మరియు జీ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :